Header Ads Widget

Responsive Advertisement

Sooseki Song telugu Lyrics: 'సూసేకి అగ్గిరవ్వ మాదిరే' సాంగ్ తెలుగు లిరిక్స్ ..."

సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి.. మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా సామి.. ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఏ రీల్స్ చేసినా ఇదే పాట వినిపిస్తుంది..



"Sooseki Song Lyrics: 'సూసేకి అగ్గిరవ్వ మాదిరే' సాంగ్ లిరిక్స్ ..." 

Movie
Pushpa 2 The Rule
Cast
Allu Arjun ,  Rashmika
Music Director
Devi Sri Prasad
Year
2024
Song
SOOSEKI
Lyricist
Chandrabose
Singers
Shreya Ghoshal

వీడు మొరటోడు అని
వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్నా
పసిపిల్లవాడు నా వాడు

వీడు మొండోడు
అని ఊరు వాడ అనుకున్న గాని
మహారాజు నాకు నా వాడు

ఓ ఓ మాట పెళుసైనా
మనసులో వెన్న
రాయిలా ఉన్న వాడిలోన
దేవుడెవరికి తెలుసును నా కన్నా

సూసేకి అగ్గిరవ్వ మాదిరే
ఉంటాడే నా సామి
మెత్తాని పత్తి పువ్వులా మరి
సంటోడే నా సామి

హో ఎర్రబడ్డ కళ్ళలోన
కోపమే మీకు తెలుసు
కళ్ళలోన దాచుకున్న
చెమ్మ నాకే తెలుసు

కోరమీసం రువ్వుతున్న
రోషమే మీకు తెలుసు
మీసమెనక ముసురుకున్న
ముసినవ్వు నాకు తెలుసు

అడవిలో పులిలా సరసర సరసర
చెలరేగడమే నీకు తెలుసు
అలసిన రాతిరి ఒడిలో చేరి
తల వాల్చడమే శ్రీవల్లికి తెలుసు

సూసేకి అగ్గిరవ్వ మాదిరే
ఉంటాడే నా సామి
మెత్తాని పత్తి పువ్వులా మరి
సంటోడే నా సామి

హో ఓ ఓ గొప్ప గొప్ప ఇనాములనే
ఇచ్చివేసే నవాబు
నన్ను మాత్రం చిన్ని చిన్ని
ముద్దులడిగే గరీబు

పెద్ద పెద్ద పనులు ఇట్టే
చక్కబెట్టే మగాడు
వాడి చొక్కా ఎక్కడుందో
వెతకమంటాడు సూడు

బయటికి వెళ్లి ఎందరెందరినో
ఎదిరించేటి దొరగారు
నేనే తనకి ఎదురెళ్ళకుండా
బయటికి వెళ్ళరు శ్రీవారు

సూసేకి అగ్గిరవ్వ మాదిరే
ఉంటాడే నా సామే
ఇట్టాంటి మంచి మొగుడుంటే
ఏ పిళ్ళైనా మహారాణీ

Post a Comment

0 Comments